ఏపీ మంత్రి బొత్స సత్య నారాయణ ఇంట విషాదం..!

Sunday, August 16th, 2020, 09:15:27 AM IST

ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇనత విషాదం నెలకొంది. ఆయనకు మాతృవియోగం కలిగింది. బొత్స తల్లి ఈశ్వరమ్మ(84) నేడు తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె ఆనారోగ్యంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ వచ్చారు.

అయితే అమమె ఆరోగ్యం క్షీణించడంతో నేడు తెల్లవారుజామున ఆమె తుది శ్వాస విడిచారు. దీంతో బొత్స ఇంట విషాదం నెలకొంది. ఈశ్వరమ్మకు ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద కుమరుడు కాగా రెండో కుమారుడు బొత్స అప్పల నరసయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. విజయనగరంలోని స్వర్ఘధామంలో ఆమె అంత్యక్రియలు జరపనున్నారు.