అందుకే రాముని విగ్రహం ధ్వంసం చేశారు.. మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు..!

Saturday, January 9th, 2021, 02:03:32 AM IST


ఏపీలో ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. విజయనగరం జిల్లా రామతీర్థంలోని రాముడి విగ్రహం ఘటనపై మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు కొన్ని దుష్టశక్తులు పనిచేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరికొంతమంది కలిసి ఈ దాడులను‌ చేయిస్తున్నారని విమర్శించారు.

అంతేకాదు జన సంచారం లేని ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం‌ చేస్తున్నారని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. కుట్రపూరితంగా దాడులకు తెగ‌బడే‌ వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రామతీర్థం ఘటన సమయంలో సీఎం విజయనగరం జిల్లా పర్యటన ఉందని, పేదలకు ఇళ్ల పంపిణీని పక్కదారి పట్టించడానికే రాముని విగ్రహం ధ్వంసం చేశారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు.