టీడీపీ సభ్యులు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు

Thursday, December 3rd, 2020, 07:30:17 AM IST

బుధవారం నాడు జరిగిన శాసన మండలి సమావేశం లో తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతలు, వైసీపీ నేతలు ఒకరు పై మరొకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకరి పై మరొకరు ఘాటు విమర్శలు చేస్తుండటం తో సభ లో ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వైసీపీ నేతలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మంత్రులు వీధి రౌడీలు గా వ్యవహరిస్తున్నారు అంటూ దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు గట్టిగానే సమాధానం ఇస్తున్నారు.

దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా వ్యాఖ్యానించారు. తాము దొడ్డి దారిన రాలేదు అని, మంత్రులు అంతా కూడా ప్రజల ఓట్ల తో ఎన్నుకోబడి వచ్చిన వాళ్ళే అని చెప్పుకొచ్చారు. అయితే అలాంటి వారిని టీడీపీ నేతలు వీధి రౌడీలు అని ఎలా అంటారు అంటూ ద్వజమెత్తారు. టీడీపీ సభ్యులు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున మాట్లాడే అవకాశం ఇవ్వరా అని మంత్రి వ్యాఖ్యానించారు. ఉమ్మారెడ్డి సైతం టీడీపీ నేతల పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హుందాగా జరగాల్సిన సభ లో టీడీపీ ఎమ్మెల్సీ లు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు అని అన్నారు.