బినామీ ఆస్తులను కాపాడుకోవడానికే చంద్రబాబు అమరావతి అని అంటున్నారు

Sunday, October 11th, 2020, 06:15:34 PM IST

ఆదివారం నాడు మీడియా తో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 13 జిల్లాల యొక్క అభివృద్దే లక్ష్యం గా సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారు అని మంత్రి వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల ప్రతిపాదన ను అన్ని జిల్లాల ప్రజలు స్వాగతిస్తున్నారు అని, చంద్రబాబు నాయుడు, అతని పెయిడ్ ఆర్టిస్టులు మాత్రమే మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారు అంటూ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక చంద్రబాబు నాయుడు బినామీ ఆస్తులను కాపాడుకునేందుకే అమరావతి అని అంటున్నారు అని ఆరోపించారు. అయితే రాజధాని నిర్మాణం కోసం అని 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాజధాని చిత్రాలు ప్రజలకు చూపించారు అని ఘాటు విమర్శలు చేశారు.

విశాఖ భూ కుంభకోణం పై త్వరలోనే సిట్ విచారణ పూర్తి అవుతుంది అని, దేని పై నైనా విచారణ జరిపేందుకు సిద్దం అని బొత్స సత్యనారాయణ తెలిపారు. అంతేకాక మాన్సాస్ వ్యవహారం కుటుంబ తగాదా అని ప్రభుత్వం కి ఏం సంబంధం అంటూ నిలదీశారు. ప్రజలకు ఇబ్బంది కలిగితే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది అని స్పష్టం చేశారు. అయితే అశోక్ గజపతి రాజు అబద్ధాలు చెప్పడానికి వ్యక్తిత్వం ఏమైంది అంటూ సూటిగా ప్రశ్నించారు.