నిరసన ర్యాలీలు చంద్రబాబు, అచ్చెన్న ఇళ్ళ ముందు చేయాలి – మంత్రి బొత్స

Wednesday, November 11th, 2020, 04:53:51 PM IST

నంద్యాల ఘటన విషయం లో టీడీపీ రాజకీయం చేయాలని చూస్తోంది అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటు విమర్శలు చేశారు. అయితే ఘటన జరిగిన వెంటనే సీఎం జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారు అని, చంద్రబాబు అధికారంలో ఉండగా ఇంత వేగంగా ఎప్పుడైనా స్పందించారా అంటూ సూటిగా ప్రశ్నించారు. నంద్యాల ఘటన పై రాష్ట్రం అంతా విచారణ వ్యక్తం చేస్తుంటే, టీడీపీ తమ లాయర్ తో నిందితులకు బెయిల్ పిటిషన్ వేయించారు అని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

306 సెక్షన్ బెయిలబులా అంటూ ప్రశ్నించారు. అయితే బెయిల్ రద్దయ్యే చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజలకు ఇళ్ళ పంపిణీ చేయాలని చూస్తుంటే, చంద్రబాబు అడ్డుపడుతున్నారు అని ఆరోపించారు. అయితే టిడ్ కో లో భారీ అవినీతి జరిగింది అని జగన్ ముందే చెప్పారు అని, అధికారం వచ్చాక 300 చదరపు అడుగుల ఇంటిని ఉచితం గా ఇస్తామని ప్రకటించారు అని, 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే టీడీపీ అడ్డుపడుతోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరసన ర్యాలీలు చంద్రబాబు అచ్చెన్న ఇళ్ళ ముందు చేయాలి మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.