అలా చేయకుంటే టీడీపీ సంఖ్య మూడుకి పడిపోవడం ఖాయం

Wednesday, August 19th, 2020, 11:38:33 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార పార్టీ పై విమర్శలు చేస్తూ, ప్రశ్నిస్తున్న టీడీపీ పై తీరు పై వైసీపీ నేతలు గట్టి గానే సమాధానం ఇస్తున్నారు. అయితే తాజాగా ఫోన్ ట్యాపింగ్ పేరుతో చంద్రబాబు కొత్త కుట్ర కోణం కి తెర లేపారు అంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన సీఎం జగన్ మోహన్ రెడ్డి కొత్తగా ఎదైనా పథకం ను ప్రవేశ పెట్టిన ప్రతి సారి కొత్త ఆరోపణల తో ప్రజల దృష్టిని మళ్లించేందుకు పన్నాగం పన్నుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే వైసీపీ కి వస్తున్న ఆదరణతో టీడీపీ కి పుట్ట గతులు ఉండవు అనే నిరాశ చంద్రబాబు ఉన్నారు అని, అంతేకాక అభద్రతా భావం తో మంచి పనులకు అడ్డు పడుతూ అభాసు పాలు అవుతున్నారు అని అన్నారు. మీడియా ను అడ్డు పెట్టుకొని అసత్య ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని, ఫోన్ ట్యాపింగ్ పై ఆధారాలు ఉంటే, డీజీపీ ఇవ్వమని కోరినా ఎందుకు ఇవ్వలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే ప్రధాని ను తిట్టిన నోటితోనే పొగుడుతున్నారు అని, చంద్రబాబు ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రకం అంటూ ఘాటు విమర్శలు చేశారు.

అయితే చంద్రబాబు నాయుడు మూడు సార్లు అధికారం చేపట్టి సీఎం అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అన్ని ప్రాంతాల వారు ఓటేస్తెనే మూడు సార్లు సీఎం అయ్యారు అని, ఆ విషయం చంద్రబాబు మరిచిపోయారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంతంగా ఆలోచించినంత కాలం చంద్రబాబు రాజకీయం బావుండేది అని, లోకేష్ ఆలోచనలతో పార్టీ ను 23 స్థానాలకు దిగ జార్చారు అని, లోకేష్ మాటలు వినడం మానకుంటే ఆ సంఖ్య కాస్త మూడు కి పడి పోవడం ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.