విశాఖనే పరిపాలన రాజధాని.. మరోసారి తేల్చి చెప్పిన అవంతి..!

Saturday, August 29th, 2020, 06:00:50 PM IST

వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలుగువారందరికి తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ బీచ్ రోడ్‌లోని తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన అవంతి మాతృభాషను పరిరక్షించుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాంద్యం ప్రెవేశపెట్టినంత మాత్రాన తెలుగును నిర్లక్ష్యం చేసినట్లు కాదని అన్నారు.

ప్రతిపక్షాలు ప్రతి సమస్యకు కులం, ప్రాంతం అడ్డుపెడుతున్నారని రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు నాయుడు అండ్ కో బ్యాచ్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉండేందుకే గెస్ట్ హౌస్‌ను విశాఖలో నిర్మిస్తున్నామని దానిపై కూడా కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటు చేయడం ఖాయమని దీనిని మాత్రం ఎవరు ఆపలేరని తేల్చి చెప్పారు.