విశాఖనే పరిపాలన రాజధాని అవుతుంది.. మరోసారి తేల్చి చెప్పిన మంత్రి అవంతి..!

Thursday, December 31st, 2020, 03:00:59 AM IST


ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకువచ్చింది. దీంతో ఏడాదిన్నరగా ఈ అంశం ఎటు తేలడం లేదు. అయితే తాజాగ దీనిపై స్పందించిన మంత్రి అవంతి శ్రీనివాస్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అవంతి దేశ చరిత్రలో ఒకేసారి 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి‌కే సాధ్యం అయ్యిందని అన్నారు.

అంతేకాదు సీఎం జగన్ చెప్ప్నట్టు మూడు రాజధానుల నిర్మాణం కూడా జరిగి తీరుతుందని, విశాఖ ఖచ్చితంగా పరిపాలన రాజధాని అవుతుందని, దానిని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. విశాఖ దక్షిణంలో టీడీపీ ఎమ్మెల్యే గెలిచినా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు. దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్, సొంత కుమారుడు లోకేశ్‌ను రంగంలోకి దింపి చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.