అలా చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి.. చంద్రబాబుపై మంత్రి అనిల్ సీరియస్..!

Tuesday, February 23rd, 2021, 03:00:22 AM IST

AP-Minister-Anil-Kumar

పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమిపాలైనా సంబరాలు చేసుకుంటుందని, దేశ చరిత్రలో ఓడిపోయినా సంబరాలు చేసుకుంది ఒక్క టీడీపీ పార్టీనే అని, ఇక భవిష్యత్తులో బూత్‌లో మెజార్టీ వచ్చినా సంబరాలు చేసుకునే పరిస్థితి వస్తుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నాలుగో విడతలో 41 శాతం స్థానాల్లో గెలిచాం అని చెప్పుకోవటానికి చంద్రబాబుకు సిగ్గు ఉండాలని, అసలు టీడీపీకి వచ్చింది 16 శాతమే అని, అది కూడా వైసీపీ రెబల్స్‌ వల్ల వచ్చాయని తెలిపారు. చంద్రబాబు సొంత ఊర్లో డిపాజిట్లు తెచ్చుకోలేకపోవడం దౌర్భాగ్యం అంటూ ఎద్దేవా చేశారు.

అయితే సర్పంచ్ ఎన్నికలకు 25 మీడియా సమావేశాలు నిర్వహించటం ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదని అయినప్పటికి 50 శాతం పంచాయతీలు తెచ్చుకోలేకపోయారని దీంతో మతి స్థిమితం కోల్పోయి చంద్రబాబు ఇష్తమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మంత్రి అనిల్ అన్నారు. వైఎస్ జగన్ పాలన, సంక్షేమ పథకాలను చూసే ప్రజలు వైసీపె మద్ధతుదారులను గెలిపించారని మంత్రి అనిల్ చెప్పుకొచ్చారు.