ఆ దిక్కుమాలిన గ్రంధం మా దగ్గర లేదు – మంత్రి అనిల్

Wednesday, December 2nd, 2020, 03:00:31 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ లో అధికార పార్టీ, ప్రతి పక్ష టీడీపీ ల మధ్య మాటల యుద్దాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే సీఎం జగన్ సైతం చంద్రబాబు నాయుడు కి గట్టి కౌంటర్ ఇచ్చారు. అయితే రైతుల కి నష్ట పరిహారం చెల్లించాలి అంటూ చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు చేస్తున్న డిమాండ్ పట్ల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందిస్తూ, సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే టీడీపీ నేతల పై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ మరియు ఇతర నాయకులు మెసేజెస్ పంపించికోడం తో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతం లో కూడా ఇలానే ఫోటోలు, వీడియోలు పంపారు అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. దయచేసి సభ్యుల సెల్ ఫోన్లు బయటే ఉంచేలా అందరం కలిసి నిర్ణయం తీసుకోవాలి అని అన్నారు. అయితే మీరు రాసుకున్న మనసులో మాట అనే దిక్కుమాలిన గ్రంధం మా దగ్గర లేదు అని సెటైర్స్ వేశారు. అయితే టీడీపీ వాళ్ళు ఆ మహా గ్రంధాన్ని తీసుకుని వస్తే చంద్రబాబు నాయుడు వ్యవసాయం గురించి ఏం రాశారు అనేది ఉంటుంది అంటూ ఎద్దేవా చేశారు.