పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేస్తాం – మంత్రి అనిల్

Thursday, March 18th, 2021, 03:00:03 AM IST


పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఏపీ జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నేడు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించిన మంత్రి అనిల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్అండ్ఆర్ కాలనీ పనులను పరిశీలించామని వరదలు వచ్చే సమయం లోపల స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, స్పిల్‌వే, గేట్లు అన్ని పూర్తి చేసి అప్పర్, లోయర్ డ్యామ్‌లను పూర్తిచేసేందుకు అన్నిఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

అయితే గోదావరి నీటిని స్పిల్ వే ద్వారా దిగువకు మళ్ళించేందుకు ప్రయత్నం చేస్తామని, కేంద్రం నుంచి అనుమతులు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తాన్నామని తెలిపారు. అయితే గత వరదల్లో డయాఫ్రం వాల్ దెబ్బతిన్నట్లు గుర్తించామని, కాపర్ డ్యామ్ పనులు పూర్తయిన తర్వాత డయాఫ్రం వాల్‌కు మరమ్మతులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని అన్నారు. డ్యామ్ నిర్మాణంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి అనిల్ చెప్పుకొచ్చారు.