చంద్రబాబును ఆ రాష్ట్రానికే పరిమితం చేద్దాం – మంత్రి అనిల్ కుమార్

Wednesday, December 16th, 2020, 02:04:26 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపించారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. 18 నెలల్లోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి అమలు చేశారు అని చెప్పుకొచ్చారు. అయితే మేనిఫెస్టో లో 90 శాతం హామీలను ఇప్పటికే అమలు చేసిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డి ది అని తెలిపారు. ఇవాళ ప్రజల ఇంటి ముందే పాలన సాగుతోంది అని మంత్రి వ్యాఖ్యానించారు.

సచివాలయాల ద్వారా అన్ని పనులు జరుగుతున్నాయి అని, తిరుపతి ఎన్నికలు ముఖ్యమంత్రి పని తీరుకి, గత ప్రభుత్వ అరాచకలాకు మద్య జరుగుతున్న ఎన్నికలు గా పేర్కొనవచ్చు అని అన్నారు. అయితే తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలో మూడు లక్షల ఓట్ల మెజారిటీ తో గెలవబోతున్నాం అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబును ఆ రాష్ట్రానికే పరిమితం చేద్దామని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు గా ఇక్కడ పని లేకనే బాబు పక్క రాష్ట్రంలో ఉండిపోయాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ట్రాక్టర్ను ఉప్పుటేరు లో పడేసినట్టే తెలుగు దేశం పార్టీ ను కూడా సముద్రం లో ముంచడం ఖాయం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.