టీడీపీ రోడ్డెక్కి చిల్లర రాజకీయాలు చేస్తోంది – మంత్రి అనిల్ కుమార్

Wednesday, November 11th, 2020, 01:33:25 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పేద ప్రజలకు ఉచిత ఇళ్ళ స్థలాలు పంపిణీ చేసేందుకు అధికార పార్టీ వైసీపీ సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు లో వేసిన పిటిషన్ ల కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇళ్ళ స్థలాల పంపిణీ విషయం పై టీడీపీ నేతలు చేస్తున్న చర్యలకి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అడ్డుపడిన తెలుగు దేశం పార్టీ నే ఇప్పుడు రోడ్డెక్కి చిల్లర రాజకీయాలు చేస్తోంది అంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే దమ్ముంటే కోర్టులో ఉన్నటువంటి కేసులను వెనక్కి తీసుకోమని మీ చంద్రబాబు కి చెప్పండి అంటు అనిల్ కుమార్ యాదవ్ ఘాటు విమర్శలు చేశారు. అయితే తెలుగు దేశం పార్టీ నేతల సుగ్గుమాలిన చర్యలను ఎండగట్టేందుకు అవసరం అయితే మహిళల తో ధర్నాలు చేస్తాం అంటూ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కి హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా పేదలకు మహిళల పేరుతో ఇంటి స్థలాలు ఇచ్చి తీరుతాం అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. అయితే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.