నిరూపించకపోతే రాజీనామా చేస్తారా.. టీడీపీ నేతలకు మంత్రి అనిల్ సవాల్..!

Friday, June 19th, 2020, 02:00:26 AM IST

నిన్న జరిగిన ఏపీ శాసన మండలి సమావేశంలో మంత్రి అనిల్ దురుసుగా వ్యవహరించారని టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే నేడి మీడియాతో మాట్లాడిన మంత్రి అనిల్ టీడీపీ నేతల వ్యాఖ్యలను ఖండించారు. అసలు శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీలే దాడి చేసి బూతులు తిట్టారని ఆరోపించారు.

అయితే సంఖ్యా బలం ఉందని మండలిలో బిల్లులు అడ్డుకుంటు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రూల్స్ కి విరుద్ధంగా లోకేష్ సభలో వీడియోలు తీశాడని దానిని అడ్డుకున్న మంత్రి వెల్లంపల్లిపై టీడీపీ నేతలు దాడి చేశారని అన్నారు. మహిళల ముందుకు వెళ్లి షర్ట్ ఇప్పి జిప్ తీసి చూపించారని నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చైర్మన్ దగ్గరకు వెళ్ళి వీడియోలు తీస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని అలా నిరూపించకపోతే రాజీనామా చేస్తానని లేఖలు ఇవ్వండి అంటూ అశోక్ బాబు, రాజేంద్రప్రసాద్, లోకేష్ దమ్ముంటే నా సవాల్ స్వీకరించండి అని అన్నారు.