బాధిత ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది

Thursday, August 20th, 2020, 06:10:19 PM IST

Alla-Nani

తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వరదల కారణంగా ప్రజలు పలు రకాల ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి జిల్లాల్లో పరిస్థితులు ఇంకా దారుణం అని చెప్పాలి. అయితే ఈ ముంపు బాధిత ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని హామీ ఇచ్చారు. బాధితులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా అన్ని విధాలా చర్యలు తీసుకోవాలి అని సీఎం జగన్ ఆదేశించిన విషయాన్ని తెలిపారు. అయితే ఆళ్ళ నాని, పేర్ని నాని, ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే బాలరాజు లు వరద బాధిత ప్రజలను పరామర్శించారు.

అయితే ముంపు ప్రాంతాల్లో ఉన్న బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపధ్యంలో లో బాధితులకు ఆర్ధిక సహాయం పట్ల ఆళ్ళ నాని స్పందించారు. బాధిత ప్రజలకు ప్రభుత్వం అందించే 2 వేల రూపాయల సహాయం నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది అని అన్నారు. ఇప్పటికే ప్రజలకు నిత్యావసరాలు అందించాం అని, జిల్లాలోని 10 వేల మందికి పైగా పునరావాస కేంద్రాలకు తరలించిన విషయం ను వెల్లడించారు. అయితే గ్రామాల్లో మెడికల్ క్యాంపు లు, వైద్యులను అందుబాటులో ఉంచడం మాత్రమే కాకుండా, అందరి సమన్వయం తో ఎటువంటి నష్టం లేకుండా నివారించ గలిగాం అని అన్నారు.