ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు – ఆళ్ళ నాని

Tuesday, December 8th, 2020, 03:40:22 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు లో అంతుచిక్కని వ్యాధి తో బాధపడుతున్న వారు కోలుకుంటున్నారు అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని అన్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 120 మంది చికిత్స పొందుతున్నారు అని వివరించారు. అయితే ప్రాథమిక నివేదికల్లో రోగుల శరీరాల్లో సీసం ఉందని తేలినప్పటికి, పూర్తి స్థాయిలో నిర్దారణకు రావాల్సిన అవసరం ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే పరీక్షలకు సంబంధించి కేంద్ర సంస్థల నివేదిక వచ్చాకే పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడిస్తామని మంత్రి తెలిపారు.

అయితే ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని భరోసా ఇచ్చారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నాం అని అన్నారు. అంతేకాక తాగునీటి సరఫరా పై దృష్టి సారించామని, శానిటేషన్ డ్రైవ్ చేపడుతున్నట్లు మీడియా సమావేశం లో వెల్లడించారు. అయితే నిత్యం జరిగే పారిశుధ్య కార్యక్రమాలకు తోడుగా నాలుగు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుననట్లు తెలిపారు.