మూడు రాజధానులపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్..!

Wednesday, September 9th, 2020, 07:34:26 AM IST

ఏపీలో మూడు రాజధానుల అంశం రోజు రోజుకు రచ్చగా మారుతున్న సంగతి తెలిసిందే. ఓ పక్క రాజధానిగా అమరావతిని మార్చవద్దు అంటూ భూములిచ్చిన రైతులు 266 రోజులుగా నిరసన దీక్షలు చేస్తుంటే, నిన్న వైసీపీ మంత్రి కొడాలి నాని అసలు అమరావతిని శాసన రాజధానిగా ఉంచడం కూడా వద్దని సీఎం జగన్‌కి చెప్పానని సంచలనం రేపాడు. అయితే కొడాలి వ్యాఖ్యలపై అటు రైతులు, టీడీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తున్నారు.

అయితే తాజాగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ సీఎం జగన్ మూడు రాజధానులు ఉంటాయని చెప్పారని తాము ఆ మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. అభివృద్ది వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానుల నిర్మాణం అని లక్ష కోట్లు ఒకే ప్రాంతంలో పెట్టుబడి పెట్టడం వృదా అని అన్నారు. టీడీపీ పథకాలకే వైసీపీ ప్రభుత్వం పేరు మారుస్తుందని చంద్రబాబు అంటుండడం హాస్యాస్పదమని అన్నారు. గతంలో రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వకూడదని వాదించిన వ్యక్తికి ఈ రోజు ఉచిత విద్యుత్ గురుంచి మాట్లాడే అర్హత లేదని అన్నారు.