ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో డీఎస్సీ..!

Wednesday, September 23rd, 2020, 12:21:04 PM IST

ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. త్వరలోనే స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలను భర్తీ చేయనున్నట్టు ప్రకటించిన మంత్రి ఆదిమూలపు సురేశ్ త్వరలో డీఎస్సీ 2020 ను కూడా నిర్వహిస్తామని తెలిపారు. అయితే న్యాయ వివాదాలతో నిలిచిన 2018 డీఎస్సీ సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టుల భర్తీకి మంత్రి షెడ్యూల్‌ని ప్రకటించారు.

అయితే ప్రస్తుతం ఇంకా 1,321 మంది ధ్రువపత్రాల పరిశీలన ఉందని అన్నారు. అయితే ఈ పోస్టులకు అర్హత సాధించిన వారి మొబైల్ నంబర్లకు మెసేజ్ పంపిస్తారని ఆ తర్వాత అభ్యర్థులు తమ ధ్రువపత్రాలను సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఎంపికైనవారు ఈనెల 24న ఆయా జిల్లాల విద్యాశాఖాధికారి కార్యాలయాలలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజర్ కావాలని, అదే రోజు ఆయా జిల్లాల్లో ఖాళీల వివరాలను డీఈవో ఆఫీస్‌ పోర్టళ్లలో ఉంచుతారని అన్నారు. ఎంపికైన వారికి ఈ నెల 25, 26 తేదీల్లో కౌన్సెలింగ్ ఇచ్చి అదే రోజు నియామక పత్రాలు ఇస్తారని, 28 వ తేదిన కేటాయించిన స్కూళ్లలో చేరాల్సి ఉంటుందని అన్నారు.