కరెంట్, నల్లా బిల్లులు కట్టేది లేదు – ఎంఐఎం ఎమ్మెల్యే

Friday, November 27th, 2020, 03:45:21 PM IST

గ్రేటర్ ఎన్నికల ప్రచారం రోజు రోజుకు మరింత హీటెక్కుతుంది. కొద్ది రోజులుగా పాతబస్తీ ప్రచారంలో మాటల తూటాలు పేల్చుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న ఎంఐఎం అదే పంథాను కొనసాగిస్తుంది. తాజాగా ఎంఐఎం పార్టీకి చెందిన బహదూర్ పూరా ఎమ్మెల్యే మౌజమ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర దుమారం రేపుతున్నాయి. పాతబస్తీలో ఎవరూ కరెంట్, నల్లా బిల్లులు కూట్టకూడదని ప్రజకు సూచించారు. ఇక్కడకు వచ్చి బిల్లులు కట్టాలని అడిగే ధైర్యం ఏ అధికారికి లేదని ఆయన అన్నారు.

అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా బహదూaర్‌పూర్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే మౌజమ్ ఖాన్ తమను ఎవరూ బిల్లు కట్టాలని అడగరని, అది ఎంఐఎం గొప్పతనమని అన్నారు. బిల్లులు కట్టే అవసరం లేకుండా ఉండాలంటే ఎంఐఎం అభ్యర్థులకు ఓటు వేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తాము ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నామని, తాము తలచుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రెండు నెలల్లో పడగొడతామని హెచ్చరించారు.