రఘురామ కృష్ణంరాజు ప్రతి పక్షాల ఎజెండా ప్రకారం నడుచుకుంటున్నారు

Tuesday, September 15th, 2020, 03:00:58 AM IST


పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాల పై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంపీ లకు దిశానిర్దేశం చేసినట్లు ఆ పార్టీ కీలక నేత మిథున్ రెడ్డి తెలిపారు. అయితే సీఎం జగన్ తో జరిగిన సమావేశం లో ప్రత్యేక హోదా అంశం పై మాట్లాడాలని సూచించిన విషయాన్ని మీడియా ద్వారా వెల్లడించారు. అంతేకాక పోలవరం ప్రాజెక్టు బకాయిలు కేంద్రం నుండి వచ్చేలా ఒత్తిడి చేయాలి అని కోరారు.

అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేసినట్లు తెలిపారు.జీఎస్టీ పెండింగ్ బకాయిలు రాష్ట్రానికి వచ్చేలా అధికారులతో కలుస్తామని తెలిపారు. గరీబ్ కళ్యాణ్ యోజన కింద వచ్చే నిధులను విడుదల అయ్యేలా కేంద్రం పై ఒత్తిడి తేవాలని సూచించారు. అయితే రాష్ట్ర అంశాల పై, సమస్యల పై మాట్లాడిన అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో కీలకం గా చోటు చేసుకుంటున్న పరిణామాల పై మాట్లాడారు. ఈ నేపధ్యంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై సైతం పలు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఆయనకు పూర్తి గౌరవం ఇచ్చింది అని, అయితే రఘురామ కృష్ణంరాజు మాత్రం ప్రతిపక్షాల ఎజెండా ప్రకారం నడుచుకున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పై త్వరలో అనర్హత వేటు వేయాలని వ్యాఖ్యానించారు.