కసబ్, యాకూబ్ ల మధ్య లింకు అదే.. !

Thursday, July 30th, 2015, 06:02:58 PM IST


ముంబై పేలుళ్ళ కేసులో దోషిగా తేలిన యాకుబ్ మెమన్ ను మహారాష్ట్ర నాగపూర్ సెంట్రల్ జైలులో నేటి ఉదయం ఉరి తీసిన సంగతి తెలిసిందే. కాగా మెమెన్ ఉరి విషయంలో తాజాగా ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇక ముంబై దాడుల నేపధ్యంగా మూడేళ్ళ క్రితం నవంబర్ 21,2012వ తేదీన ఎరవాడ జైల్లో పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ ను ఉరితీసిన కానిస్టేబుల్ ఆధ్వర్యంలోనే మెమెన్ ఉరిని కూడా నిర్వహించారని తెలుస్తోంది. అలాగే ఎరవాడలో కసబ్ ఉరికి నేతృత్వం వహించిన జైలు సూపరిండెంట్ యోగేష్ యాదవ్ కు ఎనిమిది నెలల క్రితం నాగపూర్ సెంట్రల్ జైలుకు బదిలీ కావడంతో అనుకోకుండా మెమెన్ ఉరికి కూడా ఆయనే నేతృత్వం వహించారు. కాగా మహారాష్ట్రలో నాగ్ పూర్, ఎరవాడ జైళ్లలో మాత్రమే ఉరితీసే సదుపాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మెమెన్ ను ఉరితీసిన నాగ్ పూర్ జైల్లో 1984లో ఇద్దరు సోదరులను ఉరితీసినట్లు సమాచారం.