మెగాస్టార్‌-ప‌వ‌ర్‌స్టార్ మ‌ల్టీస్టార‌ర్?

Thursday, July 5th, 2018, 02:27:58 PM IST

మెగాస్టార్ చిరంజీవి- ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కాంబినేష‌న్ మ‌ల్టీస్టార‌ర్ సెట్స్‌పైకి వెళ్ల‌నుందా? అంటే అది ఇప్ప‌ట్లో అయ్యే ప‌నేనా? అన్న సందేహాలు క‌లగ‌క మాన‌వు. వాస్త‌వానికి ఈ సినిమాని నిర్మిస్తున్నాన‌ని టీఎస్సార్ ప్ర‌క‌టించి ఏడాది పైగానే అవుతోంది. ప‌వ‌న్‌, చిరంజీవి మ‌ల్టీస్టార‌ర్‌కు త్రివిక్ర‌మ్ క‌థ రాస్తున్నార‌ని, అశ్వ‌నిదత్‌తో క‌లిసి తాను ఆ సినిమాని నిర్మిస్తాన‌ని టీఎస్సార్ ప్ర‌క‌టించారు. కానీ ఆ సినిమా ప‌ట్టాలెక్కిందే లేదు. క‌నీసం త్రివిక్ర‌మ్ దాని గురించి ఆలోచించాడా.. లేదా? అన్న‌దానిపైనా ఎలాంటి క్లారిటీ లేదు.

ఇక‌పోతే తాజాగా మరోసారి ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ గురించి బాస్ అల్లుఅర‌వింద్ ప్ర‌స్థావించ‌డం హాట్ టాపిక్ అయ్యింది. తేజ్ ఈవెంట్‌లో అర‌వింద్ మాట్లాడుతూ .. మెగాస్టార్ – ప‌వ‌ర్‌స్టార్ మ‌ల్టీస్టార‌ర్ తాను తెర‌కెక్కిస్తాన‌ని అన‌డం హాస్యాస్ప‌దం అనిపించ‌క మాన‌దు. ఇదివ‌ర‌కూ మెగాస్టార్ – బోయ‌పాటి ప్రాజెక్టును తెరకెక్కించేందుకు అల్లు అర‌వింద్ క‌ర్ఛీఫ్ వేసినా అది సెట్స్‌కెళ్లిందే లేదు. వెళ్తుందో లేదో తెలీని ప‌రిస్థితి. ఇలాంటి వేళ ప‌వ‌న్‌ని చిరుతో క‌లిసి సినిమా తీయ‌గ‌లడా? అంటూ ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక మ‌ల్టీస్టార‌ర్ చాలా క‌ష్టం అని భావించాల్సొస్తోంది.