వైల్డ్ డాగ్ ట్రైలర్ విడుదల చేసిన చిరు..!

Friday, March 12th, 2021, 05:07:09 PM IST

చిరంజీవి నాగార్జున తెలుగు సినీ పరిశ్రమ లో మంచి స్నేహితులు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం వైల్డ్ డాగ్ ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేశారు. ఫెరోసియస్, పెట్రియాటిక్ టేల్ ఆఫ్ డేర్ డెవిల్ టీమ్ అంటూ చెప్పుకొచ్చారు చిరు. నా సోదరుడు నాగ్ ఎప్పటి లాగే కూల్ అండ్ ఎనర్జిటిక్ అంటూ చెప్పుకొచ్చారు. అన్ని జోనర్ లలో నటించేందుకు ఏ మాత్రం భయపడడు అని ప్రశంశల వర్షం కురిపించారు. వైల్డ్ డాగ్ టీమ్ కి గుడ్ లక్ అంటూ చిరు చెప్పుకొచ్చారు.

అయితే అక్కినేని నాగార్జున ఈ చిత్రం లో సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. అయితే వాస్తవిక సంఘటన ల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శక నిర్మాతలు. అయితే ఈ చిత్రం లో నాగ్ ఏసిపి విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ట్రైలర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ చిత్రం ట్రైలర్ పై నెటిజన్లు, ప్రేక్షకులు, అభిమానులు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. పక్కా హిట్ అంటూ చెబుతున్నారు.