ఆచార్య సెట్స్ లోకి అడుగుపెట్టనున్న మెగాస్టార్

Friday, November 13th, 2020, 03:33:30 PM IST

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కరోనా వైరస్ భారిన పడ్డట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే తాజాగా కిట్ లోపం వలన కరోనా పాజిటివ్ వచ్చింది అని, అయితే తనకి కరోనా పాజిటివ్ కాదు నెగటివ్ అంటూ చిరు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం తెలియడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆచార్య చిత్రం షూటింగ్ లో పాల్గొనాల్సి న చిరు కరోనా వైరస్ పాజిటివ్ రావడం తో అందుకు బ్రేక్స్ పడ్డాయి.

అయితే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సెట్స్ లోకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారు. అందుకు దర్శకుడు కొరటాల శివ సైతం సన్నాహాలు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తో షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నా అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి హీరో గా, కాజల్ అగర్వాల్ కథానాయికగా ఆచార్య చిత్రం ను కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మోషన్ పోస్టర్ కూడా విడుదల అయిన సంగతి తెలిసిందే. అందుకు అభిమానుల నుండి విశేష ఆదరణ లభించింది.