సాయి కి స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

Thursday, October 15th, 2020, 02:23:42 PM IST

మెగా కాంపౌండ్ లో నుండి వచ్చిన మరొక టాలెంటెడ్ హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ మొదటి నుండి ఓడి డుడుకులను చూసిన సాయి ధరమ్ తేజ్ ఎట్టకేలకు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అపజయాలు వెంటాడుతూ ఉన్నా పలు సందేశాత్మక చిత్రాలను సైతం అందించారు. గురువారం నాడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సాయి ధరమ్ తేజ, 34 వ సంవత్సరం లోకి అడుగు పెడుతున్నాడు. అయితే పుట్టిన రోజు సందర్భంగా సెలబ్రిటీ లు, ప్రముఖులు, అభిమానులు భారీ గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి సాయి ధరమ్ తేజ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ పలు వ్యాఖ్యలు చేశారు. సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రం లోని అమృత అనే పాటను విడుదల చేశారు. హ్యాపీ బర్త్ డే డియర్ సాయి, సోలో గా ఉన్నప్పుడే ఎంజాయ్ చేయి, నీ బాచిలర్ లైఫ్ ఇంకొన్ని రోజులే అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. చిరు చేసిన ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.