శివాత్మిక ట్వీట్ పై మెగాస్టార్ చిరంజీవి స్పందన

Thursday, October 22nd, 2020, 01:39:57 PM IST

ప్రముఖ టాలీవుడ్ నటుడు రాజశేఖర్ ఆరోగ్యం పై కూతురు శివాత్మిక సోషల్ మీడియా వేదిక గా పోస్ట్ చేశారు. కరోనా వైరస్ తో పోరాడుతున్నారు అని, మీ ప్రార్థన మరియు శుభాకాంక్షలు కావాలి అని ఒక ట్వీట్ లో కోరగా, మరొక ట్వీట్ లో ఆరోగ్యం నిలకడగానే ఉంది అని, మీ విషమం గా లేదు అని, మీ ప్రార్థనలు మరియు పాజిటివీటి కావాలి అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాక ఈ విషయం ఎల్ ఎటువంటి అసత్యాలు ప్రచారం చేయొద్దు అంటూ అభిమానులను వేడుకున్నారు. అయితే నటుడు రాజశేఖర్ ఆరోగ్యం పై చిరంజీవి స్పందించారు.

శివాత్మిక చేసిన ట్వీట్ పై స్పందిస్తూ, డియర్ శ శివాత్మిక, మీ ప్రియమైన నాన్న, నా స్నేహితుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా, ధైర్యంగా ఉండండి, అందరి ప్రార్థనలతో త్వరగా కోలుకుంటారు, మీ కుటుంబం కోసం ప్రార్థిస్తున్నా అని చిరు పేర్కొన్నారు. చిరు చేసిన ట్వీట్ కు అభిమానులు స్పందిస్తున్నారు. మేము కూడా రాజశేఖర్ ఆరోగ్యం కోసం ప్రార్దిస్తాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.