ఆచార్య టీజర్ రిలీజ్.. గుణపాఠాలు చెబుతాననేమో అంటూ..!

Friday, January 29th, 2021, 05:27:59 PM IST

మెగస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్‌ ఫుల్‌ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న తాజా చిత్రం ఆచార్య. అయితే ఈ సినిమాలో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కూడా ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి చెప్పినట్టుగానే చిత్ర యూనిట్ ఈ రోజు సాయంత్రం టీజర్ రిలీజ్ చేసింది. అయితే టీజర్ విషయానికి వస్తే మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ వాయిస్‌ ఓవర్‌తో ప్రారంభం అవుతుంది.

ఇతరుల కోసం జీవించేవారు దైవంతో సమానం. మరి అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే, ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పని లేదు అంటూ రామ్‌ చరణ్ ఇచ్చిన వాయిస్ ఆకట్టుకుంది. అయితే ఫైట్ చేస్తున్న సమయంలో పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా, అందరూ ఎందుకో ఆచార్య అని అంటుంటారు, బహుశా గుణపాఠాలు చెబుతాననేమో అంటూ చిరు చెప్పే పవర్ పుల్ డైలాగ్ కేక పుట్టించింది. టీజర్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆచార్య దేవోభవ.. ఆచార్య రక్షోభవ అనే స్లోగన్‌ వినిపిస్తుంది. మొత్తానికి ఈ టీజర్ మెగా అభిమానులకు మంచి కిక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే 13న విడుదల చేస్తున్నారు.