నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి – మెగాస్టార్ చిరంజీవి

Friday, August 7th, 2020, 11:55:39 PM IST


కరోనా వైరస్ మహమ్మారి విపత్తు సమయం లో పోలీసులు చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయం అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. రక్త దానం నుండి ప్లాస్మా దానం వరకు పోలీసులు చేస్తున్న సేవను అందరూ గుర్తుంచుకోవాలి అని అన్నారు.ఇపుడున్న పరిస్తితుల్లో అసలైన ఆయుధం ప్లాస్మా అని, ప్లాస్మా దానంతో మరో ప్రాణాన్ని కాపాడిన వారం అవుతాం అని అన్నారు. రియల్ హీరోస్ తో పని చేస్తున్నందుకు ఆనందంగా ఉంది అని, సినిమాల్లో హీరోగా నటించాను అని, నిజ జీవితంలో హీరోలతో పని చేస్తున్నా అని చిరు అన్నారు. పోలీసులు ఎలాంటి సహాయం అడిగినా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చిరు స్పష్టం చేశారు.

అయితే ఈ సందర్భంగా చిరు తన అభిమానులకు సైతం పిలుపు ఇచ్చారు. అందరు ప్లాస్మా దానం చేస్తే కరోనా ను తరిమేయొచ్చు అని, నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయాలని కోరారు మెగాస్టార్ చిరంజీవి. ప్లాస్మా దానం పై అపోహలు వద్దు అని అన్నారు. అంతేకాక సినీ కార్మికులకు మూడో దఫా నిత్యవసర వస్తువులు త్వరలో పంపిణీ చేయనున్నాం అని చిరు అన్నారు.