ఈ సమ్మర్ మెగా ఫ్యామిలీ పేరు మీద నిలబడిపోనుందట..!

Monday, February 22nd, 2016, 05:13:26 PM IST


2016వ సంవత్సర ఆరంభం టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు మంచి కిక్ స్టార్ట్ నే అందించింది. జనవరి నెలలో వరుసగా రిలీజైన నాన్నకు ప్రేమతో, సోగ్గాడే చిన్ని నాయనా, ఎక్స్ ప్రెస్ రాజా వంటి సినిమాలు మంచి విజయాలను అందుకుని 200 కోట్ల పైచిలుకు కలెక్షన్లను వసూలు చేశాయి. కానీ సినిమా అభిమానుల్లో ఉన్న ఒక్కటే కొరత ఈ సంవత్సరం ఇప్పటి వరకూ మెగా ఫ్యామిలీ నుండి సినిమా విడుదల కాకపోవడం. దీంతో మెగా అభిమానులైతే మరీ డీలా పడిపొయ్యారు. వీరి కరువునే తీర్చడానికి అన్నట్టు రాబోయే సమ్మర్ ఏప్రిల్ నెలలో మెగా ఫ్యామిలీ వరుస సినిమాలతో రాబోతోంది.

ఏప్రిల్ నెల 8న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సర్దార్ గబ్బర్ సింగ్ తో వస్తుండగా.. ఆదే రోజున బన్నీ తన సరైనోడుతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా తన లేటెస్ట్ మూవీ సుప్రీం తో ఏప్రిల్ మొదటి వారంలోనే కనువిందు చేయనున్నాడు. ఇక చివరగా.. అన్నిటికంటే స్పెషల్ మెగా బ్రదర్ నాగబాబు కూతురు కొణిదల నిహారిక ఒక మనసు చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నాలుగు సినిమాలు ఒకే నెలలో రానుండటంతో మెగా అభిమానులు, సినీ పండితులు రాబోయే సమ్మర్ మెగా ఫ్యామిలీ పేరు మీద నిలబడిపోవడం ఖాయమని అంటున్నారు.