మెగా డాటర్ నీహారిక పెళ్లి ప్లేస్ అండ్ డేట్ ఫిక్స్..!

Wednesday, November 4th, 2020, 04:30:06 PM IST

కొణిదెల నీహారిక పెళ్లి డేట్ అండ్ టైమ్ ఫిక్స్ అయింది. ఇటీవల ఆగస్ట్ లో హైదరాబాద్ లో చైతన్య తో నిశ్చితార్థం చేసుకున్న నీహారిక, పెళ్లి ఈ డిసెంబర్ లో జరగనుంది. డిసెంబర్ 9 న రాత్రి 7 గంటల 15 నిమిషాలకి వీరిద్దరూ ఒకటి కానున్నారు. అయితే రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఉదయ్ విలాస్ లో వీరి వివాహం జరగనున్నట్లు చైతన్య తండ్రి, గుంటూరు ఐజి ప్రభాకర్ తెలియజేశారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణం గా చాలా తక్కువ మంది ఈ వేడుకకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, ఆప్తులు మాత్రమే ఈ పెళ్లి వేడుకకు హాజరు కానున్నారు. కరోనా వైరస్ నిబంధనలకి అనుగుణంగా తగు చర్యలు తీసుకోనున్నారు.