బీ కేర్ పుల్: కళ్లద్దాలతో కూడా కరోనా సోకే ఛాన్స్..!

Monday, August 31st, 2020, 09:27:47 AM IST

ప్రస్తుతం కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి ఏ రూపంలో కరోనా సోకుతుందో తెలియక చాలా మంది భయపడిపోతున్నారు. అయితే ముఖ్యంగా కరోనా బారిన పడకుండా ఉండాలంటే తరచూ చేతులు కడుక్కోవడం, ముఖానికి మాస్క్ పెట్టుకోవడం, శానిటైజర్ చేసుకోవడం వంటివి తప్పనిసరిగా పాటించాలని వైద్య నిపుణులు చెబుతూనే ఉన్నారు.

అయితే తాజాగా కళ్లద్దాల నుంచి కూడా కరోనా సోకే ప్రమాదం ఉనట్టు వైద్యులు చెబుతున్నారు. కళ్ల అద్దాలపై వైరస్ 9 రోజుల వరకు ఉండే అవకాశం ఉందని హైదరాబాద్‌లో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కళ్లద్దాలు ఉపయోగించే వారు ఖచ్చితంగా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు వాటిని శుభ్రం చేసుకోవాలని సూచించారు. అయితే కళ్లద్దాలను ఆల్కాహాల్ శానిటైజర్లతో కాకుండా హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో శుభ్రం చేసుకోవాలని తెలిపారు.