అవసరమైతే లాక్‌డౌన్ పొడిగిస్తాం.. తేల్చి చెప్పిన సీఎం కేసీఆర్..!

Monday, April 6th, 2020, 10:30:06 PM IST

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 364కి చేరింది. అయితే నేడు మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ కరోనా వైరస్‌పై పోరాడుతూ సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి, పారిశుధ్య సిబ్బందికి ప్రజల తరపున పాదాభివందనం చేస్తున్నానని తెలిపాడు.

అయితే వైద్య సిబ్బందికి వేతనాలలో 10శాతం, జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు 7500, మున్సిపాలీటీలు మరియు గ్రామాలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు 5 వేల రూపాయలు సీఎం గిఫ్ట్‌ కింద ఇవ్వనున్నట్టు ప్రకటించాడు. ఇకపోతే రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగితే మరో వారం లేదా రెండు వారాలు లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలు ఉన్నాయని ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్ళామని అన్నారు. ఒకవేళ కేంద్రం లాక్‌డౌన్ ఎత్తివేసినా మన రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగిస్తామని తెలిపాడు.