కరోనా ఎఫెక్ట్: మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం..!

Monday, April 6th, 2020, 09:44:28 PM IST

కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో దేశంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో మావోయిస్ట్ పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

అయితే కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఎలాంటి దాడులు చేయకూడదని మావోయిస్టులు నిర్ణయం తీసుకున్నారు. మల్కన్‌గిరి కోరాపుట్-విశాఖ డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం పేరుతో ఆడియో టేపు విడుదల అయ్యింది. వైరస్‌ను నిరోధించడానికి ప్రభుత్వాలు చేపడుతున్న ప్రయత్నాలకు తమ వైపు నుంచి ఎలాంటి ఆటంకాలు కలిగించకూడదని తీర్పునిచ్చారు.