బిగ్ న్యూస్: చంద్రబాబు, రేవంత్ నుండి ప్రాణ హాని

Friday, December 11th, 2020, 09:30:14 AM IST

గతం లో ఓటుకి కోట్లు కేసులో నిందితుడి గా ఉన్న ఏ 4 జెరూసలేం మత్తయ్య, తనకు ప్రాణ హాని ఉందని అన్నారు. తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి వర్గం నుండి తనకు ప్రాణ హాని ఉందని అన్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. అయితే ఈ కేసులో అప్రూవర్ గా మారినందునే తనను చంపేందుకు కుట్ర జరుగుతోంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ నేపథ్యం లో తనకు ఈ డి నుండి నోటీసులు వచ్చిన విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ కేసులో ముఖ్య సూత్రధారులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ కేసు పూర్తి అయ్యే వరకు తనకు రక్షణ కల్పించండి అంటూ వేడుకున్నారు. రేవంత్ రెడ్డి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

అయితే టీపీసీసి రేసులో రేవంత్ రెడ్డి కూడా ఉన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు తెర పైకి మరొకసారి ఇది వెలుగులోకి రావడం పట్ల పలు చోట్ల చర్చలు జరుగుతున్నాయి.