మారుతి విసిరాడండి బాంబోయ్‌!

Sunday, July 8th, 2018, 02:37:41 PM IST

`ప్రేమ‌క‌థా చిత్ర‌మ్‌`, `భ‌లే భ‌లే మ‌గాడివోయ్` వంటి క్లాసిక్ సినిమాలు తీశాడు మారుతి. ఈరోజుల్లో ఇమేజ్‌ని తుడిచేసిన చిత్రాలివి. అంత‌వ‌ర‌కూ బూతు డైరెక్ట‌ర్ అన్న నోళ్లే నానితో కామిక్ సినిమా చూశాక గౌర‌వించారు. మారుతిలో కొత్త యాంగిల్ ఆక‌ట్టుకుంద‌ని పొగిడేశారు. ఆ క్ర‌మంలోనే అత‌డు ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇవ్వాల‌న్న పంతంతో `శైల‌జారెడ్డి అల్లుడు` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.

ఈ సినిమా సెట్స్‌లో ఉండ‌గానే తాను నిర్మించే సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ని రివీల్ చేశాడు. `బ్రాండ్ బాబు` అనేది మారుతి నిర్మిస్తున్న సినిమా టైటిల్‌. సుమంత్ శైలేంద్ర‌, ఈష రెబ్బ జంట‌గా న‌టిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌లో తండ్రి పాత్ర‌లో న‌టించిన ముర‌ళి శ‌ర్మ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు. ఈటీవీ ప్ర‌భాక‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇంత‌కీ సినిమా క‌థేంటి? అంటే ఇంట్లో ప‌ని చేసే ప‌న‌మ్మాయికి లైనేసే కుర్రాడి వ్య‌వ‌హారంపై సినిమా ఇద‌ని చెబుతున్నారు. `మెయిడ్‌`ఎన్ ల‌వ్‌స్టోరి అనే ట్యాగ్‌లోనే ఉంది అస‌లు అర్థం. బాంబోయ్ మారుతి విసిరాడు బాంబోయ్‌!!