మాన్సాస్ ట్రస్ట్ సంచలన నిర్ణయం.. పంతం నెగ్గించుకున్న సంచయిత..!

Monday, December 28th, 2020, 06:46:51 PM IST

విజయనగరం మాన్సస్ ట్రస్ట్ సంస్థ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రస్ట్ చైర్మన్ సంచయిత గజపతిరాజు అనుకున్న పంతాన్ని నెరవేర్చుకుంది. విజయనగరం కోటలో ఉన్న మాన్సస్ రెవెన్యూ ఆఫీస్‌ను విశాఖ జిల్లా పద్మనాభంకు తరలించేందుకు ఆదేశాలు జారీ చేశారు. ట్రస్ట్ చైర్మన్ సంచయిత గజపతిరాజు ఆదేశాల మేరకు ఈ మెమో జారీ అయ్యింది.

ఇదిలా ఉంటే 1958లో విజయనగరం మహారాజా పీవీజీ రాజు హయాంలో మన్సాస్ ట్రస్ట్ ఏర్పడింది. అప్పటి నుంచి ఆ సంస్థ రెవిన్యూ ఆఫీసు విజయనగరం కోటలోనే ఉంది. అయితే తాజాగా అక్కడి నుంచి ఆఫీసును మార్చాలని సంచయిత గజపతి రాజు భావించింది. పరిపాలన సౌలభ్యం, మేనేజ్‌మెంట్, భద్రత గురించి రెవెన్యూ ఆఫీసును విజయనగరం కోట నుంచి విశాఖపట్నానికి తరస్తున్నట్టు ఉత్తర్వులు రిలీజ్ చేశారు.