బిగ్ న్యూస్: అనంతపురం లో భారీ అవినీతి… ఎనిమిది ట్రంక్ పెట్టేల్లో ఆభరణాలు…నగదు

Thursday, August 20th, 2020, 11:08:19 PM IST

అనంతపురం జిల్లాలో భారీగా అవినీతి సొమ్ము బయటపడింది. అనంతపురం ఖజానా ఉద్యోగి డ్రైవర్ యొక్క బంధువు ఇంట్లో దొరికిన ఎనిమిది ట్రంక్ పెట్టెలు.. అందులో 2.42 కిలోల బంగారం, 84.10 కిలోల వెండి మరియు 15.55 లక్షల రూపాయల నగదు లభ్యం అయింది. మూడు 9 ఎం ఎం గ్యాస్ పిస్టల్స్ కూడా లభ్యం అయ్యాయి. అనంతపురం, బుక్కరాయ మండల కేంద్రం లో ఈ ఘటన చోటు చేసుకుంది. తుపాకుల కోసం సోదాలు నిర్వహించగా భారీ మొత్తం బయటపడింది.

అయితే ఆ ఇంటి యజమాని బాలప్పా ఒక సాధారణ వ్యక్తి. తన అల్లుడు నాగలింగం తన వద్ద ఈ సామాను దాచి ఉంచినట్లు బాలప్ప పోలీసులకు తెలిపారు. నాగాలింగం, అనంతపురం ట్రెజరీ ఉద్యోగి మనోజ్ వద్ద డ్రైవర్ గా పని చేస్తున్నారు. అయితే బలప్పా తెలిపినట్లు గా ఈ సంపద మనోజ్ కి చెందినది అని పోలీసులు తెలిపారు. వీటి తో పాటుగా రెండు కార్లు, ఒక హెర్లీ డేవిడ్ సన్, రెండు రాయల్ ఎన్ఫీల్స్, రెండు కరిశ్మ బైక్స్, నాలుగు ట్రాక్టర్లు, 49 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ కి సంబందించిన పాత్రలు దొరికాయి.

అయితే భారీగా ఆభరణాలు, నగదు కలిగి ఉండటం తో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సంపద లెక్క తెలుసు కునేందుకు ఏసీబీ రంగలోకి దిగానున్నట్లు అధికారులు తెలిపారు.