వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలి.. కేంద్రానికి మాణికం ఠాగూర్ డిమాండ్..!

Thursday, November 5th, 2020, 06:20:15 PM IST

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్ కేంద్ర ప్రభుత్వానికి సరికొత్త డిమాండ్ వినిపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా చేవెళ్లలో కాంగ్రెస్‌ పార్టీ రైతుల నుంచి సంతకాల సేకరణ చేపట్టింది. ఈ సందర్భంగా మాట్లాడిన మాణికం ఠాగూర్ వ్యవసాయ బిల్లులను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఓ పక్క బంగారు తెలంగాణ పేరుతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసం ప్రజలను చేస్తుందని అన్నారు.

టీఆర్ఎస్ అవినీతి పాలనను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. రైతులను వ్యవసాయానికి దూరం చేసేలా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వ్యవసాయ బిల్లును ప్రవేశపెట్టడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. అయితే కేంద్ర వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ చేసి రాష్ట్రపతి, గవర్నర్‌లకు పంపుతామని అన్నారు. ఈ కొత్త చట్టాలతో మార్కెట్లు మూతపడి ప్రైవేటు వ్యాపారస్తుల చేతిలో రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు.