బ్రేకింగ్: ఏపీలో కరోనా బారిన పడిన మరో ఎమ్మెల్యే..!

Sunday, August 16th, 2020, 04:20:03 PM IST

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎవరి నుంచి కరోనా సోకుతుందో ఎవరికి అర్ధం కానీ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసులు, డాక్టర్లతో పాటు ప్రజలలో ఎక్కువగా తిరిగే ప్రజాప్రతినిధులు కూడా ఈ మధ్య ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు.

అయితే ఏపీలో ముఖ్యంగా మొన్నటి వరకు అధికార పార్టీనీ కరోనా వణికించింది. అయితే తాజాగా ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఎమ్మెల్యేకి కరోనా సోకింది. తూర్పు గోదావరి జిల్లా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తుండగా, గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు ఐసోలేషన్‌లో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.