వచ్చే ఎన్నికలలో మాదే అధికారం.. కేసీఆర్ సర్కార్‌పై మందకృష్ణ సీరియస్..!

Friday, August 14th, 2020, 09:03:54 AM IST

తెలంగాణలో 2023 ఎన్నికలలో తామే అధికారంలోకి వస్తామని మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. దొరల పాలనకు చరమగీతం పాడి మహాజన రాజ్యాన్ని సాధిస్తామని అన్నారు. సీఎం కేసీఆర్ దళితులను మోసం చేసి సీఎం అవుతాడని తాను 2003లోనే తల్లి తెలంగాణ పుస్తకంలో చెప్పానని అన్నాడు.

అయితే ఎన్నికలకు మూడేళ్ల ముందే కేసీఆర్ పాలనపై యుద్ధం ప్రకటిస్తున్నామని తెలిపాడు. తాము అధికారంలోకి వస్తే వరంగల్‌ను శాసన రాజధానిగా చేసి భవిష్యత్‌లో అద్భుత పరిపాలన చేస్తామని అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి ఆ ఊసే లేదని అన్నారు. ఆరేళ్ళు అధికారంలో ఉన్నా ద‌ళిత, గిరిజ‌నుల‌కు ఎందుకు భూమి ఇవ్వలేదని ప్రశ్నించారు. లోటు బ‌డ్జెట్‌లో ఉన్న ఏపీలో క‌రోనా చికిత్స‌ను ఆరోగ్య‌శ్రీ‌లో చేర్చార‌ని, మిగులు బ‌డ్జెట్‌లో ఉన్న తెలంగాణ‌లో మాత్రం ఎందుకు చేర్చటం లేద‌ని అన్నారు.