మనప్పురం మిసెస్ సౌత్ ఇండియా మూడవ ఎడిషన్ కాంటెస్ట్ ఎక్కడంటే?

Friday, September 25th, 2020, 03:46:33 PM IST

మనపురం మిసెస్ సౌత్ ఇండియా కాంటెస్ట్ ను సెప్టెంబర్ 30 న కేరళలోని కొచ్చిలో SAJ ఎర్త్ రిసార్ట్ లో నిర్వహించనున్నది. మూడవ ఎడిషన్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం మాత్రమే కాకుండా కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుండి కనీసం ఎనిమిది మంది పోటీ లో పాల్గొననున్నారు. తెలంగాణ తరపున కాజల్ రావ్తానీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే కరోనా లాక్ డౌన్ అనంతరం భారత దేశం లో జరగనున్న మొదటి బ్యూటీ ఈవెంట్ ఇదే.

ఈ బ్యూటీ ఈవెంట్ లో అందం మాత్రమే కాకుండా, తెలివితేటలు, ప్రతిభ, సామాజిక నిబద్దత కూడా కొలుస్తారు. ఈ రంగం లో ఎంతో ప్రశంసలు పొందిన వ్యక్తులు జడ్జింగ్ ప్యానల్ లో పాల్గొంటారు. ఈ పోటీ లో మిసెస్ సౌత్ ఇండియా తో పాటుగా, మిసెస్ సౌత్ ఇండియా రన్నరప్, మిసెస్ సౌత్ ఇండియా రెండవ రన్నరప్ టైటిల్స్ తో పాటుగా మిసెస్ పర్సనాలిటీ, మిసెస్ ర్యాంప్ వాక్, మిసెస్ టాలెంట్, మిసెస్ హ్యూమనిసేస్, మిసెస్ గ్లామరస్ లుక్, మిసెస్ వ్యూయర్స్ ఛాయిస్, ది మిసెస్ సోషల్ మీడియా కూడా ఇవ్వబడతాయి.