బిగ్ న్యూస్: వైసీపీ ఎంపీ నందిగాం సురేశ్‌పై దాడికి యత్నం..!

Friday, October 16th, 2020, 03:01:09 PM IST

వైసీపీ ఎంపీ నందిగాం సురేశ్‌పై ఓ వ్యక్తి దాడికి యత్నించాడు. గుంటూరు జిల్లా తూళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఎంపీ నందిగాం సురేశ్ ఉద్ధండరాయునిపాలెంలోని తన ఇంటి నుంచి కారులో బయలుదేరుతుండగా పూర్ణచంద్రరావు అనే వ్యక్తి ఎంపీ వాహనానికి బైక్ అడ్డుపెట్టి దూషించడం మొదలుపెట్టాడు.

అయితే ఇదేమిటని అడిగేందుకు వెళితే ఇనుప రాడుతో దాడి చేసేందుకు మీదకు రావడంతో వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతడిని పట్టుకున్నారు. అయితే అతడు అక్కడి నుంచి తప్పించుకు పారిపోయేందుకు కాసేపు ప్రయత్నించాడు. అది వీలుకాకపోవడంతో చివరకు అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే దాడికి యత్నించిన పూర్ణచంద్రరావు టీడీపీకి చెందిన వ్యక్తి అని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.