కేటీఆర్ పేరు చెప్పి ఎంపీ కేకేకు ఫోన్ చేసిన మోసగాడు..!

Wednesday, August 26th, 2020, 09:07:07 PM IST

Kesavarao

టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎంపీ కేశవరావును కేటీఆర్ పేరు చెప్పి మహేశ్ అనే ఓ మోసగాడు బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించాడు. కేంద్ర పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ను అంటూ మహేశ్ అనే వ్యక్తి ఎంపీ కేశవరావుకు ఫోన్ చేశాడు. 25 మంది నిరుద్యోగులకు 25 లక్షల రుణం ఇస్తామని, కేటీఆర్ చెప్పడం వలనే మీతో మాట్లాడుతున్నట్టు చెప్పాడు.

అయితే మహేశ్ మాటలను ముందు నమ్మిన కేకే తన కుమార్తె అయిన విజయలక్ష్మీతో మాట్లాడాలని చెప్పాడు. అయితే కేకే కూతురు కొంతమంది నిరుద్యోగులను ఎంపిక చేయగా లోన్ ప్రాసెసింగ్ ఫీజు కింద ఒక్కొక్కరు లక్షా 25 వేల రూపాయలు తన అకౌంట్‌లో వేయాలని మహేశ్ చెప్పాడు. అయితే అఖిల్ అనే ఓ వ్యక్తి మహేశ్ అకౌంట్‌లో 50 వేలను డిపాజిట్ చేశాడు. అయితే ఈ వ్యవహారంపై కేకేకు అనుమానం రావడంతో కేంద్ర పరిశ్రమల శాఖకు ఫోన్ చేసి దీనిపై ఆరా తీశాడు. తమ శాఖలో మహేశ్ అనే వ్యక్తి ఎవరూ పని చేయడం లేదని కేంద్ర పరిశ్రమల శాఖ అధికారులు తెలపడంతో ఈ విషయాన్ని కేకే బంజారాహిల్స్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నిందితుడు మహేశ్‌పై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.