జై తెలంగాణ.. కేసీఆర్ సార్ అంటూ వ్యక్తి ఆత్మహత్యాయత్నం..!

Thursday, September 10th, 2020, 02:23:07 PM IST

హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. జై తెలంగాణ.. కేసీఅర్ సార్ అంటూ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తెలంగాణ వచ్చినా తనకు న్యాయం జరగలేదని తమను ఆదుకోవాలంటూ చేతులు జోడించి ప్రార్ధించాడు.

అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు, స్థానికులు ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే బాధితుడు రంగారెడ్డి జిల్లా కడ్తాల్ గ్రామ వాసిగా గుర్తించారు. అతడు అబిడ్స్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో పనిచేస్తుండగా లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయాడు. కొన్ని నెలలుగా ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు తల్లెత్తడంతో విసుగు చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.