కరోనా వాక్సిన్ రెండో డోస్ తీసుకొని వ్యక్తి మృతి

Wednesday, March 3rd, 2021, 08:40:59 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే ఈ మహమ్మారి కి వాక్సిన్ అందుబాటులోకి రావడం తో వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే మహారాష్ట్ర లోని థానే జిల్లాలో ఓ ఆసుపత్రి లో కరోనా వైరస్ కి వాక్సిన్ రెండో డోస్ ను తీసుకున్న ఒక వ్యక్తి కొద్ది సేపటికే మృతి చెందడం కలకలం రేపుతోంది. అయితే అక్కడి స్థానిక వైద్యుడి కి డ్రైవర్ గా పని చేస్తున్న 45 ఏళ్ల వ్యక్తి సుఖ్దయో కిర్దిట్ మంగళవారం ఉదయం 11 గంటల సమయం లో వాక్సిన్ వేయించుకొని కొద్దిసేపు టీకా కేంద్రం వద్ద వెయిటింగ్ హాలు లో కూర్చున్నాడు. అయితే కొద్ది సేపటికే తల తిరుగుతూ ఉండటం తో వైద్యుల దృష్టి కి తీసుకెళ్ళాడు. అయితే అక్కడ నుండి ఐజిఎం ఆసుపత్రి కి తరలించగా అప్పటికే వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. అయితే పోస్ట్ మార్ట్ అనంతరం మృతి కి సంబంధించిన కారణం తెలుస్తోంది అని అక్కడి మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ తెలిపారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం వాక్సిన్ రెండో డోస్ వేయించుకొనేందుకు వెళ్ళాడు అని అంటున్నారు.