హన్మకొండ లో దారుణం…ప్రియురాలి గొంతుకోసిన ప్రేమోన్మాది!

Friday, January 10th, 2020, 08:29:39 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. ఒక ప్రేమోన్మాది తాను ప్రేమించిన యువతీ గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. అయితే కాజీపేట కి చెందిన షాహిద్ మరియు గుండ్లసింగారం కి చెందిన హారతి కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే వీరిద్దరూ హన్మకొండలోని మాస్టర్జీ డిగ్రీ కాలేజీలో చదువు పూర్తీ చేసారు. అయితే వీరు రాంనగర్ లో నివాసం వుంటున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం వారిద్దరికీ మాటమాట పెరిగి అది కాస్త ఘర్షణగా మారింది. అయితే ఈ క్రమంలో షాహిద్ కత్తితో తన ఫై దాడి చేసి గొంతు కోసి చంపేశాడు. అయితే దీనికి సంబంధించిన పూర్తీ వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. హత్యకు గల కారణాలు ఏమై వుంటాయని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాజీపేట లోని చైతన్యపురి కాలనిలో రజాక్ మటన్ షాపులో షాహిద్ పై చేసేవాడు. ఈ ఘటన తో ఒక్కసారిగా వరంగల్ వాసులు ఉలిక్కిపడ్డారు.