దారుణం: అనంతపురంలో స్నేహితులతో కలిసి యువతిని హత్య చేసిన ప్రియుడు

Wednesday, December 23rd, 2020, 07:03:16 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో దిశ చట్టం తీసుకొచ్చిన తర్వాత కూడా మహిళల పై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అనంతపురం లోని ధర్మవరం మండలం లో దారుణం చోటు చేసుకుంది. స్నేహితుల తో కలిసి ఒక వ్యక్తి తాను ప్రేమించిన అమ్మాయి ను దారుణంగా చంపేశాడు. చంపిన అనంతరం మృతదేహం పై పెట్రోల్ పోసి నిప్పటించాడు. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అక్కడి పోలీస్ అధికారులు వివరించారు.

ఆ యువతి ధర్మవరం కి చెందిన స్నేహ లత గా గుర్తించారు. ఆ యువతి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో కాంట్రాక్ట్ ఉద్యోగి గా విధులు నిర్వహిస్తోంది. మంగళవారం నాడు బ్యాంక్ కి వెళ్ళిన ఆ యువతి కనిపించకుండా వెళ్ళడం తో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బుధవారం తెల్లవారుజామున యువతి మృతదేహాన్ని బడనపల్లి వద్ద గుర్తించారు. అయితే రాజేష్ మరియు కార్తీక్ అనే ఇద్దరు యువకులు తమ కుమార్తెను హత్య చేసినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చాలాకాలం గా వారు ప్రేమ పేరుతో వేధిస్తున్నారు అని తెలిపారు. అయితే ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.