సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్..!

Tuesday, August 18th, 2020, 08:10:20 AM IST

KCR

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఓ వ్యక్తి కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కరోనాతో చనిపోయాడని, ఆయనకు ముక్కు ద్వారానే కరోనా సోకినట్టు గాంధీ వైద్యులు నిర్ధారించారన్న ఫేక్ న్యూస్‌ని దుబాయ్‌లో ఉంటున్న పణ్యాల రాజు అనే వ్యక్తి ఫేస్‌బుక్ ఫేజ్ ద్వారా పోస్ట్ చేశాడు.

అయితే ఈ ఫేక్ ప్రచారంపై మండిపడ్డ టీఆర్ఎస్ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జూన్ నెలలోనే అతగాడిపై సైబర్ క్రైం పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. 188, 469, 54, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అతడిని ఎల్వోసీ ద్వారా ఇండియాకు రప్పించి అరెస్ట్ చేశారు.