ముఖ్యమంత్రుల సమావేశానికి ఆ ఇద్దరు డుమ్మా!

Sunday, December 7th, 2014, 01:01:14 PM IST


ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా రూపుదిద్దుకాబోతున్న సంస్థ ఏర్పాటుపై అభిప్రాయాలు సలహాలు సూచనలు తెలుసుకునేందుకు ప్రధాని మోడీ అధ్యక్షతన ఈరోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ప్రధాని మోడీ నివాసంలో ప్రారంభమయింది. ఆంధ్రప్రదేశ్… తెలంగాణ ముఖ్యమంత్రులతో సహా అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

అయితే… ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఆయన హాజరుకాకపోవడం వెనుక రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలే కారణం అని తెలుస్తున్నది. కాని… జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రధాని మోడీ సుడిగాలి పర్యటన చేసి….ఓట్లను కొల్లగోడుతున్నారనే ఉద్దేశ్యంతో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ సమావేశానికి హాజరుకాలేదని తెలుస్తున్నది.

ఇది ఇలా ఉంటే..సిపీఎం కంచుకోటగా ఉన్న బెంగాల్ ను ఒంటిచేత్తో కూలగొట్టి.. అక్కడ జెండా పాతిన తృణముల్ కాంగ్రెస్ నాయకురాలు.. ప్రస్తుత బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఈ సమావేశానికి హాజరు కాలేదు. కోల్ కతాలో బీజేపి ర్యాలీని మమతా వ్యతిరేకించినప్పటికీ… బీజేపి ర్యాలీని చేపాట్టి విజయవంతం చేయడంతో.. మమతకు కోపం వచినట్టున్నది. ఇక శారదా చిట్ ఫండ్ స్కాం లో మమత సర్కారు సతమతమావ్వడం కూడా ఆమె గైర్హజరకు కారణం అని తెలుస్తున్నది.