బెంగాల్ లో తెలుగు కి అధికారిక భాష హోదా… మమతా బెనర్జీ కీలక నిర్ణయం!

Wednesday, December 23rd, 2020, 08:36:15 AM IST

బెంగాల్ లో తెలుగు కి అధికారిక భాష హోదా ను కల్పించారు మమతా బెనర్జీ ప్రభుత్వం. అయితే పశ్చిమ బెంగాల్ లో తెలుగు వారిని భాషాపరమైన మైనారిటీ లుగా గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మమతా బెనర్జీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పలువురు ప్రముఖులు నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మిని ఆంధ్రా గా పేరున్న ఖరగ్ పూర్ లోని ఓటర్లను ఆకర్షించేందుకు మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే రైల్వే ఉద్యోగాల కోసం ఎంతోమంది ఉత్తరాంధ్ర నుండి వలన వెళ్లిన వారు అక్కడే స్థిరపడి ప్రస్తుతం రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. పలు చోట్ల ఖరగ్ పూర్ లో తెలుగు వారు వార్డ్ కౌన్సిలర్ లుగా, అలాగే పలు పార్టీల్లో కీలక పాత్ర పోషిస్తున్న నేపద్యం లో మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే పలు ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు కి అధికారిక భాష హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తుండటం తో కేబినెట్ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.